Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తింపజేసిన బాహుబలి సినిమా మొదటి పార్ట్ చైనాలో ఫ్లాప్ అయిన విషయం తెల్సిందే. చైనాలో ఇటీవల భారతీయ సినిమాలు చైనాలో దుమ్ము దుమ్ముగా కలెక్షన్స్ సాధించాయి. ‘దంగల్’ చిత్రం అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. అయితే బాహుబలి మొదటి పార్ట్ మాత్రం కనీసం ప్రింట్ మరియు పబ్లిసిటీ ఖర్చులు కూడా వసూళ్లు చేయలేక పోయింది. దాంతో రెండవ పార్ట్‌ను విడుదల చేయాలా వద్దా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ సభ్యులు ఇన్నాళ్లు వెనుకంజ వేశారు. అయితే ఇండియన్ సినిమాలు అక్కడ భారీ ఎత్తున వసూళ్లు సాధించిన నేపథ్యంలో రెండవ పార్ట్ ఖచ్చితంగా అక్కడ వసూళ్లు రాబడుతుందనే నమ్మకంతో కొందరి సలహా మేరకు విడుదల చేయడం జరిగింది.
చైనాలో భారీ ఎత్తున విడుదలైన బాహుబలి 2 చిత్రం ఆశించినట్లుగా మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టాయి. కేవలం మొదటి రోజు ఏకంగా 20 కోట్లను వసూళ్లు చేసింది. గతంలో విడుదలైన దంగల్ చిత్రం మొదటి రోజు 18 కోట్లను వసూళ్లు చేయగా దంగల్ మాత్రం ఏకంగా 20 కోట్లు రాబట్టి దుమ్ము రేపింది. సంచలనాత్మకంగా మొదటి రోజు కలెక్షన్స్ ఉండటంతో తప్పకుండా తర్వాత తర్వాత కూడా ఉంటాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది. 250 కోట్ల టార్గెట్‌తో బాహుబలి 2 చిత్రం అక్కడ విడుదలైంది. అయితే అది సాధ్యం అయ్యేనా కాదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.