ప్లీజ్‌ బాలయ్య స్పందించండి

Bala Krishna Fans want Clarity About NTR Biopic Movie Director

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Bala Krishna Fans want Clarity About NTR Biopic Movie Director

నందమూరి బాలకృష్ణ దాదాపు మూడు నెలల క్రితం తాను నాన్న గారు ఎన్టీఆర్‌ గారి జీవిత చరిత్రతో బయో పిక్‌ చిత్రాన్ని తీస్తాను అంటూ ప్రకటించాడు. ఆ సినిమాను ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ముగించాలో తనకు బాగా తెలుసు అంటూ కూడా ఆ మద్య బాలయ్య వ్యాఖ్యలు చేశాడు. అయితే అందుకు కాస్త సమయం పడుతుందని, ఈ గ్యాప్‌లో దర్శకుడిని ఫైనల్‌ చేస్తాను అంటూ బాలయ్య ఆ మద్య మీడియాతో చెప్పుకొచ్చాడు. ఉన్నట్లుండి ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. ఎన్టీఆర్‌పై పాటను చేయడంతో పాటు ఆయన సృష్టిస్తున్న హడావుడితో వర్మ నిజంగానే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడని అనిపిస్తుంది.

ఎన్టీఆర్‌ కథతో వర్మ సినిమా కన్ఫర్మ్‌. అయితే అందులో ఎవరు నటిస్తారు అనే విషయమై ఆసక్తి నెలకొంది. కొందరు బాలయ్యతోనే వర్మ ఆ బయోపిక్‌ను రూపొందించబోతున్నట్లుగా భావిస్తున్నారు. మరి కొందరు మాత్రం బాలీవుడ్‌ హీరోతో ఎన్టీఆర్‌ బయో పిక్‌ను తెరకెక్కించేందుకు వర్మ ప్లాన్‌ చేస్తున్నాడు అంటున్నారు. బాలయ్యతో వర్మ ఆ సినిమాను తీస్తే పూర్తి స్వేచ్చగా, తాను అనుకున్న విధంగా, ఉన్నది ఉన్నట్లుగా వర్మ తీయలేడు. అందుకే బాలయ్యతో వర్మ ఆ సినిమా చేయడు అని కొందరు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కాని అసలు విషయం మాత్రం ఏంటో తెలియరావడం లేదు. బాలయ్య ఈ విషయమై ఒక క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ చిరు నిర్మాతకి హ్యాండ్?