అఖిల్‌ మూవీకి ఆ చిన్న చిత్రంతో సంబంధం ఏంటి?

Rendu Rella Aaru Movie Releasing Same Time Akhil Second Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”

Rendu Rella Aaru Movie Releasing Same Time Akhil Second Movie

సాయి కొర్రపాటి నిర్మాణంలో అంతా కొత్త వారితో తెరకెక్కిన చిత్రం ‘రెండు రెళ్ళు ఆరు’. ఈ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కాన్సెప్ట్‌ మరియు అఖిల్‌ రెండవ చిత్రం కాన్సెప్ట్‌ ఒక్కటేనట. అఖిల్‌, విక్రమ్‌ల మూవీ ప్రారంభం అయిన తర్వాత ఆ విషయం తెలిసింది. అప్పుడు నిర్మాత నాగార్జున ఆ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటిని ఒప్పించి సినిమా విడుదల కాకుండా నిలిపేయాలని భావించాడు. అయితే అప్పటికే సినిమా పూర్తి చేయడంతో పాటు, కొన్ని ఏరియాల్లో కూడా అమ్మేయడం వల్ల సినిమాను విడుదల చేయకుండా ఉండలేమని చెప్పాడట.

‘రెండు రెళ్ళు ఆరు’ చిత్రం విడుదల ఆపడం సాధ్యం కాకపోవడంతో కథలో పలు మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దాంతో సినిమాను దాదాపు రెండున్న నెలలు ఆలస్యం చేశాడు. ఇదొక ప్రేమకథ. చిన్నప్పటి నుండి కొన్ని కారణాల వల్ల గొడవపడుతూ వచ్చే ఇద్దరు జీవితంలో ఎలా ప్రేమలో పడ్డారు, వారికి వారి తల్లిదండ్రుల నుండి ఎదురైన ఇబ్బందులు ఏంటి అనేది కథ. ఇదే కథతో ‘రెండు రెళ్లు ఆరు’ తెరకెక్కింది. ఇప్పుడు అఖిల్‌ చిత్రం కూడా అటు ఇటుగా మార్చి తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా వచ్చే సంవత్సరంలో విడుదల కాబోతుంది. మొదటి సినిమా ఫ్లాప్‌తో అఖిల్‌ రెండవ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

మరిన్ని వార్తలు:

రుణం తీర్చుకోబోతున్న మాస్‌రాజా

చరణ్‌తో ‘స్పైడర్‌’..!