టాలీవుడ్‌ అమితాబ్‌..!

Jagapathi Babu Become Tolly Wood Amitabh Bachchan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలీవుడ్‌ మెగాస్టార్‌ హీరో అమితాబచ్చన్‌. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించిన అమితాబ్‌కు మద్యలో గ్యాప్‌ వచ్చింది. అమితాబ్‌ కెరీర్‌ ఇక ఖతం అయ్యింది అనుకున్న సమయంలో ‘సర్కార్‌’ చిత్రంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో అమితాబ్‌ ఇక వెనుకకు చూడకుండా  అయ్యింది. ఇప్పటికి కూడా అమితాబచ్చన్‌ తనదైన శైలిలో దూసుకు పోతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో అదే తరహా ఇమేజ్‌ను జగపతిబాబు సొంతం చేసుకోనున్నాడా అనే చర్చ జరుగుతుంది. ఫ్యామిలీ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించిన జగపతిబాబు మద్యలో సక్సెస్‌ లేకుండా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత విలన్‌ వేశాలు వేశాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ను జగపతిబాబు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. 

ఈ సమయంలోనే జగపతిబాబు మరోసారి హీరోగా అదృష్టంను పరీక్షించుకునేందుకు సిద్దం అయ్యాడు. అమితాబచ్చన్‌ హిందీలో వయస్సు పైబడిన పాత్రలు చేస్తూ వాటితో మెప్పిస్తాడు. హీరోగా అంత వయస్సు పెట్టుకుని నటించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు జగపతిబాబు కూడా వయస్సుకు తగ్గ పాత్రలతో హీరోగా అలరించేందుకు సిద్దం అయ్యాడు. అందులో భాగంగానే మొదటగా ‘పటేల్‌ సర్‌’ అనే చిత్రాన్ని చేశాడు. వైవిధ్యభరిత చిత్రాలను అందించడంలో అందెవేసిన చేయి అయిన వారాహి చలన చిత్రం నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించాడు. దాంతో తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్‌ అయితే జగపతిబాబు టాలీవుడ్‌ అమితాబ్‌గా మారిపోవడం ఖాయం.

మరిన్ని వార్తలు