Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్’ను తాత్కాలికంగా పక్కకు పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం బాలయ్య తన తదుపరి చిత్రాన్ని వినాయక్ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సి కళ్యాణ్ సిద్దంగా ఉన్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఒక వైపు వినాయక్ సినిమా కోసం సిద్దం అవుతున్నా కూడా బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ఎన్టీఆర్’ మూవీకి సంబంధించిన పనులు చూసుకుంటూనే ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమాకు మొదట తేజను అనుకున్నప్పటికి ఆయన తప్పుకోవడంతో ఆ స్థానంలో క్రిష్‌ను బాలయ్య దాదాపుగా తీసుకు వచ్చాడు. క్రిష్ అయితే తన తండ్రి ‘ఎన్టీఆర్’ చిత్రంకు పూర్తి న్యాయం చేస్తాడనే నమ్మకంను బాలయ్య కలిగి ఉన్నాడు.
ఎన్టీఆర్ సినిమా కోసం బాలయ్య మరియు ఆయన సన్నిహితులు కలిసి స్క్రిప్ట్ రెడీ చేశారు. అయితే క్రిష్‌కు అది నచ్చలేదు. గతంలో తేజ కూడా అది నచ్చక పోవడం వల్లే తప్పుకున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. క్రిష్‌కు కూడా నచ్చక పోవడంతో బాలయ్య స్క్రిప్ట్‌పై సర్వ హక్కులు ఇచ్చేసి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనుకుంటున్నారో అదే చూపించండి అంటూ క్లీయరెన్స్ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ గురించి అందరు మెచ్చేలా, అందరు నచ్చేలా చూపిస్తే చాలని, స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే విషయంలో తాను ఎలాంటి అడ్డంకులు చెప్పను అంటూ బాలయ్య హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నెగటివ్స్ లేకుండా తాను పూర్తి స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పు చేసి, కొత్త స్క్రిప్ట్‌ను రెండు నెలల్లో పూర్తి చేస్తాను అంటూ బాలయ్యకు క్రిష్ తెలియజేశాడు. వచ్చే సంవత్సరంలో ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మరో నాలుగు నెలల్లో ప్రారంభించబోతున్నారు.