రేపు అన్ని విషయాలపై క్లారిటీ

NTR Biopic Movie Cast And Crew Details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ చిత్రం రేపు లాంచనంగా ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ పోషించనుండగా, తేజ దర్శకత్వంలో సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని బాలయ్యతో కలిసి నిర్మిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. హీరోయిన్‌ విషయం, మరో హీరో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడని, తేజ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు అంటూ ఎన్నో ఎన్నెన్నో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. రేపు చిత్రం ప్రారంభోత్సవం సందర్బంగా పలు పుకార్లకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఫుల్‌స్టాప్‌ పెట్టే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం రేపు ప్రారంభోత్సవంకు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్బంగా దర్శకుడు తేజ ఈ చిత్రంకు దర్శకత్వం వహించబోతున్నాడా లేదా అనే విషయంపై క్లారిటీ రాబోతుంది. ఇక హీరోయిన్‌గా విద్యాబాలన్‌ అంటూ వస్తున్న పుకార్లపై కూడా క్లారిటీ ఇస్తారు. అలాగే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా ఈ చిత్రంలో కనిపిస్తాడా లేదా అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ‘ఎన్టీఆర్‌’ చిత్రం గురించిన పలు విషయాలు రేపు తెలుస్తాయనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. నందమూరి అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.