Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలయ్య తేడా సింగ్‌గా కనిపించిన ఈ సినిమాకు విమర్శకుల నుండి మరియు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా మినిమం పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ భారీగా వచ్చే రోజులు ఇవి. కాని బాలయ్య సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. మొదటి వారం రోజులు ముగిసినప్పటికి ఇంకా కలెక్షన్స్ 18 కోట్ల వద్దే ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒక స్టార్ హీరో సినిమాకు సక్సెస్ టాక్ వస్తే మొదటి మూడు రోజుల్లోనే 20 కోట్ల షేర్ దాటాలి. కాని బాలయ్య మాత్రం కలెక్షన్స్‌ను రాబట్టడంలో విఫలం అయ్యాడు.
‘పైసా వసూల్’ సినిమాకు కలెక్షన్స్ రాకపోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సినిమా బాగున్నా కూడా ఒక వైపు ‘ఫిదా’ మరో వైపు ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలు దుమ్ము రేపుతున్నాయని, వాటి కలెక్షన్స్ జోరులో ఈ సినిమా తేలిపోయిందని అంటున్నారు. యూత్ ఆడియన్స్ మొత్తం అర్జున్‌రెడ్డి వైపు, ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా చిత్రం వైపుకు పరుగులు తీస్తున్న ఈ సమయంలో బాలయ్య సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కరువయ్యారు అందుకే కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి బాలయ్య బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోవడంతో ఆయన అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న 102వ సినిమా అయినా దుమ్ము లేపుతుందేమో చూడాలి.
మరిన్ని వార్తలు: