Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చంద్రబాబు పరిపాలనాదక్షత, అనుభవం చూసే కిందటి ఎన్నికల్లో టీడీపీ కి అధికార పగ్గాలు అప్పగించారు. జగన్ మీద మోజు కన్నా బాబు పాలన కే ఓటరు మొగ్గుజూపిన విషయం బహిరంగ రహస్యమే. అయితే టీడీపీ లో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి పదవులు పొంది బాబుని పాలనాదక్షుడని కొనియాడి ఆ తర్వాత పార్టీ మారిన సి.రామచంద్రయ్య మాత్రం ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. టీడీపీ టూ పీఆర్ఫీ, పీఆర్ఫీ టూ కాంగ్రెస్ చేరుకున్న రామచంద్రయ్య తాజాగా బాబు కన్నా బాలయ్య, యనమల సీఎం అయితే బాగుంటుందని అంటున్నారు. బాబు కన్నా వీళ్ళు అయితేనే బాగా పరిపాలిస్తారని కూడా రామచంద్రయ్య వాదన.
దావోస్ యాత్ర తో పాటు ఇటీవల ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ వల్ల ఏ ప్రయోజనం లేదన్న రామచంద్రయ్య ఉత్తుత్తి ప్రచారంతో ప్రజలని మభ్యపెడుతున్నారని చంద్రబాబు మీద ఆరోపణలు చేశారు. రామచంద్రయ్య ఆరోపణల్లో నిజానిజాల మాట ఎలా వున్నా చంద్రబాబు కన్నా బాలయ్య, యనమల పాలనాదక్షులని చెప్పడం ద్వారా ఆయన విశ్వసనీయతను ఆయనే దెబ్బ తీసుకున్నారు. ఒకప్పుడు టీడీపీ లో ఓ వెలుగు వెలిగి రాజకీయ తప్పుడు నిర్ణయాలతో కెరీర్ పోగొట్టుకుని చంద్రబాబు మీద ఇలా ఏడ్చి సాధించేదేమీ ఉండదు. ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకోవడం తప్ప.