రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నాగార్జున హీరోగా ‘అన్నమయ్య’ సినిమా వచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 1997లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో గణ విజయం సొంతం చేసుకుంది. ఆ టైం లో నాగార్జున చేస్తూన్నా సినిమాలు వేరు. ఇక అలంటి సమయం లో ఈ భక్తి చిత్రంలో ఆయన ఎలా ప్రేక్షకులని మెప్పిస్తారా అనే ఒక సందేహం అభిమానుల్లో ఉండేది. ఆ అనుమానాలకి అడ్డుకట్ట వేసే నటనతో మెప్పించారు నాగార్జున .
ఇక ఈ సినిమాలో దేవుడు వేంకటేశ్వరస్వామి రూపం లో సుమన్ నటించారు. అయితే మొదట ఈ పాత్ర కోసం బాలయ్యబాబు ని అనుకున్నారట. ఆయన రూపం అందుకు బాగా సరిపోతుందనే అనుకున్నారట కానీ. ఇక్కడే ఇంకొక సమస్య వచ్చి పడింది అంట.
ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో అన్నమయ్య అంటే నాగార్జున .. వేంకటేశ్వరస్వామి పాదాలపై పడవలసిన సన్నివేశం ఉంది. ఈ సన్నివేశాలను నందమూరి అభిమానులు అలాగే .. అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో ఎలా రియాక్ట్ అవుతారో అనే ఒక సందేహం వచ్చిందట. ఎందుకొచ్చిన లొల్లి అని చెప్పే, హీరో సుమన్ ను సంప్రదించరట ఇక అయన ఓకే సెప్పడం తో ఈ సినిమాలో అయన యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ పాత్రకి సుమన్ ఎంతగా న్యాయం చేసారో అందరికి తెలిసిందే ఇకఈ సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో కూడా ప్రత్యెకం గా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికి ప్రేక్షకులు ఈ సినిమాని టీవీ లో వస్తే చుస్తూనే ఉంటారు.