Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన 102వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు ‘కర్ణ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ‘కర్ణ’తో పాటు ‘రెడ్డి గారు’, ‘జయసింహా’ అనే టైటిల్స్‌ను కూడా పరిశీలించారు. తాజాగా ఈ చిత్రానికి ‘జైసింహా’ అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను నిర్మాత చేస్తున్నాడు. సెంటిమెంట్‌తో ఈ టైటిల్‌కు బాలయ్య ఆసక్తి చూపుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
గతంలో ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘సీమ సింహా’, ‘లక్ష్మీనరసింహా’, ‘సింహా’ చిత్రాలు బాలయ్య కెరీర్‌లో సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాల టైటిల్స్‌లో సింహా పేరు కామన్‌గా ఉంది. అందుకే ఆ కామన్ పేరును అంటే సింహా పేరును తన తాజా చిత్రంలో పెట్టాలని నిర్ణయించారు. దర్శకుడు రవికుమార్ ‘కర్ణ’ అనే టైటిల్‌ను అనుకున్నప్పటికి బాలయ్య మాత్రం ‘జైసింహా’కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య నిర్ణయాన్ని బట్టి నిర్మాత కళ్యాణ్ తాజాగా ఫిల్మ్ ఛాంబర్‌లో ‘జై సింహా’ టైటిల్‌ను రిజిస్ట్రర్ చేయించడం జరిగింది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా నయనతార నటిస్తుంది. మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ఈ చిత్రంలో బాలయ్యకు జతగా నటిస్తున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయాలని మొదట భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదల ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.