Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్(21) అంత్యక్రియలు బుధవారం అశ్రునయనాల మధ్య ముగిశాయి. రాంనగర్‌లోని దత్తాత్రేయ నివాసంలో వైష్ణవ్ మంగళవారం రాత్రి భోజనం చేస్తుండగానే గుండెపోటుతో కుప్పకూలి ఆస్పత్రిలో మృతిచెందిన విషయం విదితమే. వైష్ణవ్ మృతదేహాన్ని స్వగృహానికి తరలించి నిన్న మధ్నాహ్నం ఒంటి గంట వరకు సందర్శనార్థం ఉంచారు. తర్వాత సైదాబాద్ శ్మశాన వాటికలో కురుమ కుల సంప్రదాయ పద్ధతిలో జరిగాయి. వైష్ణవ్‌కు వివాహం జరగకపోవడంతో కుల సంప్రదాయ ప్రకారం జిల్లేడు చెట్టుతో వివాహం జరిపించారు. ఒగ్గు కళాకారులు మల్లన్న పటాలను వేశారు. దత్తాత్రేయ సోదరుడు రాజశౌరి కుమారుడు శివశంకర్ ఇంగ్లీకం పట్టుకుని ముందుకు సాగారు. అంతిమయాత్ర రాంనగర్‌లోని దత్తాత్రేయ ఇంటి నుంచి ప్రారంభమైన రాంనగర్ గుండూ, అడిక్‌మెట్, విద్యానగర్, నల్లకుంట, కాచిగూడ మీదుగా సైదాబాద్‌లోని హిందూ శ్మశాన వాటికలో వైష్ణవ్ మృతదేహాన్ని ఖననం చేశారు.