రోజులు మారాయి అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకెల్తున్నారు అంటే ఏంటో అనుకున్నా, కానీ ఆ మాట నిజమే అని ఈ వార్త చదివాక మీకు కూడా అర్ధం అవుతుంది. మద్యానికి బానిసైన భర్త తన తాగుడికి డబ్బులు ఇవ్వాలని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు అనే కేసులు చూసాం ఇప్పటి దాకా కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందిగా అందుకే అన్నీ రివర్స్ లో జరుగుతున్నాయి. మద్యానికి బానిసైన తన భార్య డబ్బులు ఇవ్వాలని.. వజ్రాభరణాలు కొనివ్వాలంటూ వేధిస్తోందని బెంగళూరులో ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అందుతున్న వివరాల ప్రకారం నగరంలోని ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ధీరజ్రెడ్డికి 2014లో జయశ్రుతితో వివాహమైంది.
రెండేళ్లపాటు సంతోషంగా ఉన్న జయశుత్రి ఆ తర్వాత తనకి వజ్రాభరణాలు కొనివ్వాలని, పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ ధీరజ్ రెడ్డిని వేధించడం మొదలెట్టింది. అంతే కాక రూ. 30 లక్షల విలువగల వజ్రాభరణాలు కొనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తన భార్య తనను బెదిరిస్తూ రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ భార్యతో సహా అత్తింటివారు డిమాండ్ చేస్తున్నారని ధీరజ్ వాపోయాడు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే… అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్టు కేసు పెడతామని బెదిరించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు. తన భార్య సిగరెట్లు, మందు తాగుతుందని ఈ విషయంపై అత్తామామలకు ఫిర్యాదు చేయగా వారు ఆమెకే మద్దతు పలుకుతున్నారని తమ కూతురు చెప్పినట్టు వినాలని బెదిరిస్తున్నారని తెలిపాడు. వీరి టార్చర్ భరించలేకపోతున్నానని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ కోసం రావాల్సిందిగా జయశ్రుతితో పాటు ఆమె కుటుంబ సభ్యులకి తాఖీదులు జారీ చేశారు.