టెస్టు మ్యాచ్‌ను వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు

టెస్టు మ్యాచ్‌ను వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు

డే నైట్ టెస్టు‌ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్నది. భారత్ తో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కామెంటేటర్‌గా ఉండబోయే అవకాశం లేదని ధోనీ సన్నిహిత వర్గాలు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి తెలిపాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోల్‌కతా వేదికగా రెండో టెస్టుని డే నైట్ టెస్టుగా ఆడేందుకు ఒప్పుకుంది.

తొలిసారిగా డే నైట్ టెస్టుకు ఆడబోతున్న తరుణంలో ఈ మ్యాచ్‌కు ప్రత్యేక గుర్తింపు రావాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రయత్నాలు చేస్తున్నారు. భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్లను ఆహ్వానించి వారి అనుభవాలను పంచుకోవాలని నిర్ణయించగా ధోని కామెంటేటర్‌గా బీసీసీఐకి హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రతిపాదన పంపింది. కానీ బీసీసీఐ బోర్డు ఇంకా తుది నిర్ణయం ఇవ్వలేదు.

డే నైట్ టెస్టులో ధోని కామెంటేటర్‌గా ఉండ బోయే అవకాశం లేదని అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత రెండు నెలలపాటు క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ధోనీ బీసీసీఐ కాంట్రాక్టు ఆటగాడిగానే కొన సాగుతున్నాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌కు మొదటి టెస్టు మ్యాచ్ అవడం వల్ల  భారత ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాలకు టెస్ట్ వీక్షించడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆహ్వానం పంపారు.