కాగా ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శిశిరతాన్‌సేన్ అనే వ్యక్తి కటక్‌లోకి సెంట్రల్ బ్యాంక్ బిరబటి శాఖలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం సెలవు పెట్టి సొంతూరుకు వెళ్లిన శిశిరతాన్‌సేన్‌కు అక్కడ ఓ యువతి పరిచయం అయింది. ఆ సమయంలో ఆ బ్యాంక్ మేనేజర్ ఆమెకు లోన్ ఇప్పిస్తానని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ మధ్య సెలవులు ముగియడంతో అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. కాగా అతను ఏమాత్రం స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషల్ లో ఫిర్యాదు చేసింది. దీంతో శిశిరతాన్‌సేన్‌పై కేసు నమోదు చేసుకున్న ఝార్ఖండ్ పోలీసులు కటక్ చేరుకుని చౌలియాగంజా ఠాణా పోలీసుల సహాయంతో ఆ బ్యాంక్ మేనేజర్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌లోకి తీసుకుని ఝార్ఖండ్‌కు తరలించి విచారిస్తున్నారు.