Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంస్య యుగానికి చెందినవిగా భావిస్తున్న ఆయుధాలును స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లో వెలికి తీశారు. నాలుగువేల ఏళ్ల క్రితం నాటి ఈ ఆయుధాలను ఓ పర్వతారోహకుడు లేదా పశువులను కాపలాకాసే వ్యక్తి ఉపయోగించిఉండొచ్చని పురాతత్వశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. విల్లు, బాణాలు, ఆహారం భద్రపరుచుకునే చెక్కపెట్టె వీటిలో ఉన్నాయి. పర్వత శ్రేణుల్లో 8800 అడుగుల ఎత్తులోని గుహలో శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు. 2011లో ఈ గుహను కనుగొనగా 2012లో తవ్వకాలు మొదలుపెట్టారు. గుహను పూర్తిగా తవ్వి అందులో వస్తువులను వెలికి తీసేందుకు ఐదేళ్లకు పైగా సమయం పట్టింది. విపరీతంగా మంచుకురిసే ప్రదేశం కావడంతో గుహను పూర్తిగా తవ్వడానికి ఇన్నేళ్లు పట్టింది. క్రీస్తు పూర్వం 1800 నుంచి 2000 ఏళ్ల మధ్య ఈ వస్తువులను ఉపయోగించినట్టు కార్బన్ డేటింగ్ పద్ధతిలో నిర్ధారణ అయింది. వీటిపై మరిన్ని పరిశోధనలు అవసరమని పురాతత్వశాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.