బీసీసీఐ ఐపీఎల్ ప్రారంభ వేడుకలను రద్దు చేసే ఆలోచనలో ఉంది. ఐపీఎల్ ప్రారంభ వేడుకలను డబ్బు వృధా అనే భావనతో బీసీసీఐ ఉంది. ఐపీఎల్‌లో నోబాల్ అంపైర్‌ను కూడా తీసుకురానుంది. బీసీసీఐలోని ఓ అధికారి మాట్లాడుతూ ప్రారంభోత్సవ వేడుకలపై క్రికెట్ అభిమానులు అంతగా ఆసక్తి చూపక పోవడంతో వేడుకల్లో పాల్గొంటున్న నటీ నటులకి ఇంకా ఇతర కళాకారులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. వేడుకల లేకుండా ఐపీఎల్ 2020 సీజన్ టోర్నీలు కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.
పుల్వామా ఉగ్రదాడిలో నష్ట పోయిన జవాన్ల కుటుంబాల కొరకి ప్రారంభోత్సవ వేడుకలు అవసరం లేదని సీఓఏ అధినేత వినోద్ రాయ్ భావించగా బీసీసీఐ ఐపీఎల్ 2019 ఆరంభోత్సవ వేడుకలకు 20 కోట్ల రూపాయలు హారచు అవుతుందని అంచనా వేసి దాని నుండి 11 కోట్ల రూపాయలను భారత సైన్యానికి విరాళంగా ఇచ్చింది. సీఆర్పీఎఫ్‌కు 7 కోట్లు, నావికా దళం మరియు వాయు దళానికి కలిపి రెండు కోట్లు విరాళంగా అందజేశారు