భారత క్రికెటర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. విదేశాల్లో క్రికెట్ సిరీస్‌లకు టీమిండియా క్రికెటర్లు తమ భార్యలతో వెళ్లడం పరిపాటి. కానీ త్వరలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్ పర్యటనలో తొలి మూడు టెస్టుల వరకు భారత ఆటగాళ్లు తమ భార్య, ప్రియురాళ్లకు దూరంగా ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. కనీసం నెల రోజులపాటు తమ జీవిత భాగస్వామి, స్నేహితురాళ్లకు దూరంగా ఉండాలని సూచించింది. చాలా సందర్భాల్లో ఆటగాళ్ల వైఫల్యాలకు వారి కుటుంబ సభ్యులే కారణమంటూ విమర్శలు వచ్చాయి. కోహ్లీ వైఫల్యానికి అనుష్క, ధోనీ వైఫల్యానికి సాక్షి కారణమంటూ గతంలో విమర్శలు వచ్చాయి.
ఇక.. ఇంగ్లండ్‌లో భారత్ టెస్ట్ సిరీస్ గెలిచి దశాబ్దం దాటిపోవడంతోపాటు ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోవడంతో ఇక కీలకమైన టెస్టు సిరీ్‌స్ లో ఫలితం ప్రతికూలంగా వస్తే ఇలాంటి విమర్శల దాడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా కనీసం మూడు టెస్టుల వరకైనా ఫ్యామిలీని దూరంగా పెట్టుకోమ్మని సూచించింది బీసీసీఐ. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోవడంతో మరి చూడాలి భార్యలు స్టేడియంలో లేకపోతే మనోళ్లు సత్తాచాటుతారో లేదో.