ఇవాళ ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా మరో రసవత్తర పోరు జరగనుంది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య బీకర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకాడే స్టేడియంలో జరుగుతోంది. ఈరోజు రాత్రి 7:30 నిమిషాల ప్రాంతంలో ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
అయితే ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో ముంబై అలాగే బెంగళూరు చెరొక మ్యాచ్ గెలిచాయి. ఇవాళ 2 జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకమే అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మాత్రమే టోర్నీలో కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్ లో ఎవరు ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా నెలకొనే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 2 జట్లు ఈ మ్యాచ్లో చాలా ఉత్కంఠ భరితంగా, కష్టపడి ఆడాల్సి ఉంటుంది. ఇక టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.