Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సమ్మర్ కానుకగా రాబోతున్న మహేష్‌బాబు ‘భరత్ అను నేను’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’లపై అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాలు కలిపి 300 కోట్ల బిజినెస్ చేసే అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రెండు సినిమాల విడుదల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాని రెండు చిత్రాల నిర్మాతలు కూడా విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నారు. చాలా నెలల క్రితం బన్నీ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయాలని భావించారు. ఆ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇక అదే తేదీలో మహేష్‌బాబు ‘భరత్ అను నేను’ చిత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
ఈ రెండు చిత్రాలు విడుదల కాబోతున్న తేదీలోనే రజినీకాంత్ ‘2.0’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దాంతో విడుదల తేదీపై గందరగోళం నెలకొంది. రజినీకాంత్ 2.0 చిత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుందని, ‘కాలా’ చిత్రాన్ని తీసుకు రావాలని చిత్ర యూనిట్ సభ్యులు భావించారు. రజినీకాంత్ చిత్రంతో పోటీ పడటం ఎందుకని భావించిన బన్నీ అండ్ టీం ఒక్కరోజు ముందుగానే సినిమాను విడుదల చేయాలని భావించారు.
బన్నీ చిత్రం విడుదల తేదీ మార్చడంతో మహేష్ ‘భరత్ అను నేను’ చిత్రాన్ని కూడా అదే తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దీంతో బన్నీ నిర్మాత లగడపాటి శ్రీధర్ సినిమా పెద్దలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తాము అనుకున్న తేదీకే మహేష్‌బాబు సినిమాను విడుదల చేయాలని దానయ్య భావిస్తున్నాడు అంటూ లగడపాటి శ్రీధర్ ఛాంబర్లో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నాడు. ఈ వివాదం మెల్ల మెల్లగా పెరిగి పెద్దదవుతుంది.