Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో ‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం ‘భరత్ అను నేను’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని మొదట వైజాగ్ ఆర్కే బీచ్‌లో చేయాలని భావించారు. రంగస్థలం చిత్రం ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లో సూపర్ హిట్ అయిన కారణంగా భరత్ అను నేనును అక్కడే చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత విజయవాడలో ఆడియో విడుదల చేయాలని భావించారు. చివరకు హైదరాబాద్‌లోనే ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.
మహేష్‌బాబు గతంలో ఎక్కువ సినిమాలు హైదరాబాద్‌లో ఆడియో విడుదల కార్యక్రమం జరుపుకున్నాయి. అయితే భరత్ అను నేను చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కడంతో వైజాగ్ లేదా విజయవాడలో ఆడియో విడుదల చేయాలనుకున్నా ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా, అక్కడ ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమాల కారణంగా సినిమా ఆడియో వేడుకను హైదరాబాద్‌లో చేయాలని నిర్మాతలు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఆడియో వేడుక అయితే అభిమానులు ఎక్కువగా హాజరు అయ్యే అవకాశం ఉందని కూడా ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అమైరా దస్తూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సీఎంగా మహేష్‌బాబు కనిపించబోతున్నాడు.