తగ్గాలని ఫిక్స్‌ అయిన మహేష్‌..!

bharath ane nenu movie release on april first week or second week

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘భరత్‌ అను నేను’. దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే మహేష్‌బాబు స్పైడర్‌ చిత్రం కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 27న విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత నుండి అధికారిక ప్రకటన వచ్చింది. అదే రోజు అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాపేరు సూర్య’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు అంటూ చర్చ జరుగుతున్న సమయంలో షాకింగ్‌గా రజినీకాంత్‌ ‘2.0’ చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

 తగ్గాలని ఫిక్స్‌ అయిన మహేష్‌..! - Telugu Bullet

రజినీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌ మూవీకి పోటీగా రావడం సాహస నిర్ణయం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘2.0’. ఈ చిత్రం ఏప్రిల్‌ 27న రాబోతున్న నేపథ్యంలో మహేష్‌బాబు, అల్లు అర్జున్‌లు ఆలోచనల్లో పడ్డారు. ఈ రెండు సినిమాల్లో కనీసం ఒక్క సినిమా అయినా వాయిదా పడుతుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే మహేష్‌బాబు సినిమా వాయిదా పడటం కాకుండా రెండు వారాల ముందు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్‌ మొదటి లేదా రెండవ వారంలో ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని విడుదల చేసేందుకు తేదీని మార్చబోతున్నట్లుగా నిర్మాత దానయ్య నుండి అనధికారిక సమాచారం అందుతుంది. మొత్తానికి మహేష్‌బాబు సేఫ్‌ గేమ్‌ ఆడేందుకు ముందే వచ్చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. మరి బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి.