‘భరత్‌ అనే నేను’ కథ ఇదేనా?

Bharath Ane Nenu movie Story leaked

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు సీఎంగా కనిపించబోతున్నాడు. సీఎం అయిన తన తండ్రి చనిపోవడంతో ఉన్నట్లుండి భరత్‌ సీఏంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. రాజకీయాలపై అప్పటి వరకు పెద్దగా అవగాహణ లేని భరత్‌ కొన్ని పొరపాట్లు చేస్తాడు. ఆ పొరపాట్లను సరి చేసుకుని, తన తల్లి చెప్పిన సూత్రంను దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగిస్తాడు. ఆ క్రమంలో సొంత పార్టీ నాయకులతో మరియు కొందరు వ్యక్తులతో విభేదించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో భరత్‌ ఎలా తన పరిపాలన సాగించాడు, భరత్‌కు అడ్డు వచ్చిన అంశాలు ఏంటీ అనే కథాంశంతో ఈ చిత్రంను దర్శకుడు కొరటాల తెరకెక్కించాడు.

ఈ కథ చాలా సింపుల్‌గా అనిపించినా కూడా దర్శకుడు కొరటాల శివ చాలా విభిన్నంగా, ఫుల్‌ మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా స్క్రీన్‌ప్లే ఉందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మహేష్‌బాబును సీఎంగా ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు మరియు సినీ వర్గాల వారు కౌంట్‌ డౌన్‌ మొదలు పెట్టారు. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కైరా అద్వాని హీరోయిన్‌గా నటించింది. ‘రంగస్థలం’ రికార్డులే టార్గెట్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 150 కోట్ల షేర్‌ కలెక్షన్స్‌ మహేష్‌ టార్గెట్‌ అంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు. ఓవర్సీస్‌లో గతంలో ఏ ఇండియన్‌ సినిమా విడుదల కాని రేంజ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.