మెగాస్టార్ చిరంజీవి హీరోగా ,మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ గా ,మరో అందాలభామ కీర్తి సురేశ్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తున్న చిత్రం “భోళాశంకర్.”. ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి చిత్రాల తరహాలో సీరియస్ కథాంశం కాకుండా క్లాస్ , మాస్ ప్రేక్షకుల్ని ఫుల్ ఆన్ ఎంటర్టయినింగ్ అంశాలు పుష్కలంగా ఉండేటి చిత్రం భోళాశంకర్. ఈ ప్రచారం నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భోళాశంకర్ సినిమాని ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.కాగా,భోళాశంకర్ నుంచి ఈ నెల 27న మెగా ట్రైలర్ విడుదల కానుందని చిత్రబృందం నేడు అనౌన్స్ చేసింది.
అభిమానులూ… మెగా ఎంటర్టయినింగ్ యాక్షన్ కోసం గెట్ రెడీ అంటూ దర్శకుడు మెహర్ రమేశ్ అప్ డేట్ ఇచ్చారు.ఈ సినిమా కోసం మహతి స్వరసాగర్ బాణీలు కట్టిన పాటలు ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంటున్నాయి.