Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డికి నంద్యాల గ్రామీణంలో చాలా పెద్ద ఓటుబ్యాంకు ఉంది. ఆయన పార్టీలో చేరితే లాభమని భావించి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు.. ఎప్పుడు ఎవర్ని తీసుకోవాలో తెలియదా.. ఇప్పుడు గంగుల చేరికపై అఖిల రియాక్షన్ చూస్తే మాత్రం అదే అంతుబట్టడం లేదు.
దీంతో అఖిలప్రియ పొగరు ఈ రేంజ్ లో ఉందన్నది చంద్రబాబుకు కూడా తెలిసొచ్చినట్లైంది. ఇప్పటిదాకా సర్దుకుపోవాలని నేతలకు చెప్పిన బాబు.. అఖిలప్రియ రియాక్షన్ చూసి మనసులోనే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. సీఎం అనే గౌరవం లేకుండా మూడు రోజుల ముందు పార్టీలోకి తీసుకుంటే ఏం జరుగుతుందని అన్యాపదేశంగా అఖిల మాట్లాడిన మాటలు టీడీపీలో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఎప్పుడు తీసుకున్నామనేది కాదు.. ఎంత బాగా ప్లాన్ చేశామనేదే ముఖ్యం. మీడియా సాక్షిగా గంగుల ఇచ్చిన పిలుపుతో ఆయన అనుచరుల్లో ఎవరో కొందరైనా మనసు మార్చుకోకపోతారా అనేది బాబు ప్లాన్. ఎన్నికల సమయంలో రకరకాల ఎత్తులు వేయాలి, అంతేకానీ లాభనష్టాలు బేరీజు వేస్తూ కూర్చుంటే చంద్రబాబుకీ, అఖిలప్రియకీ తేడా ఏముంటుంది.
మరిన్ని వార్తలు: