టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ ఇస్తూ… మరోసారి రిమాండ్ పొడిగించారు. ఈ మేరకు ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు రిమాండ్ పై విజయవాడ ఏసిబి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ను పొడిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. తాజాగా ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన ప్రకారం చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. దీంతో చంద్రబాబు నాయుడు నవంబర్ ఒకటవ తేదీ వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఖైదీ జీవితాన్ని అనుభవించనున్నారు. అయితే చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. దీనిపై లేఖ ద్వారా తమకు తెలియజేయాలని కోర్టు పేర్కొంది.