అక్కినేని అఖిల్ దాదాపు ఒక మంచి హిట్టు కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఆయన ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడకపోవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.. అయితే కథల ఎంపిక విషయంలో తడబాటు వల్లే అఖిల్ ఇలా తన కెరీర్లో ఒక సక్సెస్ ను కూడా చూడలేదంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల వచ్చిన ఏజెంట్ మూవీ పైన ఆయన పూర్తిస్థాయిలో నమ్మకం పెట్టుకున్నారు. కానీ పూర్తిస్థాయిలో అది డిజాస్టర్ గా మిగిలింది. ఇది ఇలా ఉండగా, అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కి కష్టాలు వెంటాడుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీ OTT రిలీజ్ పలుమార్లు వాయిదా పడగా, అయితే తాజాగా ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని సోనీలివ్ ప్రకటించింది. అయితే డిస్ట్రిబ్యూషన్ లో నిర్మాత మోసం చేశారంటూ సతీష్ అనే వ్యక్తి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. వాదనలు విన్న కోర్టు OTT రిలీజ్ పై స్టే విధించినట్లు అయన తరుపు లాయర్ సుధాకర్ గారు వెల్లడించారు.