మరో YCP MLC రాజీనామా…

YS Jagan
YS Jagan

YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్సీ షాక్ ఇచ్చారు. మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకీయా ఖానమ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసన మండలిలో YCP కి మరో వికెట్ డౌన్ అయింది. మండలి డిప్యూటీ చైర్మెన్‌గా ఉన్న జకియా ఖానమ్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో పార్టీలో కలకలం రేగింది. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్‌ను జాకీయా ఖానమ్ కలిసినట్లు సమాచారం.