తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో మొత్తం 14 మంది సభ్యులు ఉన్నారు .. అయితే ఈసారి సీరియల్ నటీనటులు ఎక్కువ అయిపోయారు. ఇక శివాజీ ఒక్కడే చాలా మందికి తెలిసిన ముఖం కావడంతో ప్రేక్షకులు చాలా నిరాశతోనే ఈ సీజన్ ను చూస్తున్నారు . ఇప్పటికి ఒక వారం పూర్తి అయ్యి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కూడా అయిపోయింది. ఈ వారం ఎలిమినేషన్ అయ్యే వారిలో షకీలా మరియు టేస్టీ తేజ పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి , షకీలా ఎలిమినేట్ అవుతుందని బాగా తెలుస్తోంది. కాగా నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ లో అస్త్ర లు గెలుచుకున్న అమరదీప్ టీం లో వారిని ఓడిపోయిన గౌతమ్ టీం లో ఒక్కక్కరు ఒకరి దగ్గర ఉన్న అస్త్రను అదే టీం లో మరొకరికి ఇవ్వాలన్న బిగ్ బాస్ నిబంధనతో చేస్తూనే ఉన్నారు . కానీ నాలుగవ ప్లేస్ దగ్గరకు వచ్చే సరికి గౌతమ్ టీం అంతా రతికను పంపాలని నిర్ణయించుకున్నారు .. అందుకు రతికా ఒప్పుకోకపోవడంతో హౌస్ అంతా పూర్తి నిరాశలో మునిగిపోయింది. ఎవ్వరు చెబుతున్నా ఆమె వినకుండా మూర్ఖంగా ప్రవర్తించడంతో అందరూ ఆమెపై ఆవేశంతో ఉన్నారు .
ముఖ్యంగా రతిక – దామిని మధ్యన గొడవ, రతిక – గౌతమ్ మధ్యన గొడవ మరియు సందీప్ రతిక ల మధ్యన ఆఖర్లో అమర్ డీప్ అందరిమీద నిరాశతో ఆవేశపడడం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు అని చెప్పాలి. మొత్తానికి .. హౌస్ లో ఉన్న 12 మంది చెబుతున్నా వినకుండా రతిక అందరి ఓపికను పరీక్షించి బసు పాలైంది.