బిగ్‌బాస్‌ అధికారిక ప్రకటన, చెప్పినట్లే..!

Bigg Boss Season 2 telugu starting date on June 10

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. నాని హోస్ట్‌గా 100 రోజుల పాటు ప్రసారం కాబోతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను జూన్‌ 10న ప్రారంభించబోతున్నారు. 16 మంది సెలబ్రెటీలతో ఈ షోను ప్రారంభించబోతున్నారు. మొదటి సీజన్‌కు రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌ వచ్చింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించడంతో పాటు, మొదటి సారి బిగ్‌బాస్‌ షో తెలుగులో అవ్వడం వల్ల స్టార్‌ మాటీవీకి లాభాల పంట పండటం జరిగింది. అయితే రెండవ సీజన్‌కు ఎన్టీఆర్‌ నో చెప్పడంతో స్టార్‌ మాటీవీ నానితో ఈ షోకు ప్లాన్‌ చేశారు. నాని హోస్ట్‌గా షో అనగానే కొందరు నిటూర్చారు. కాని స్టార్‌ మా మాత్రం తప్పకుండా నాని ఆకట్టుకుంటాడని, బిగ్‌బాస్‌కు ప్రత్యేక శోభను తీసుకు వస్తాడని అంచనా వేస్తున్నారు.

నాని గతంలో రేడియో జాకీగా పని చేశాడు. ఆ అనుభవంను రంగరించి, యూత్‌లో తనకున్న క్రేజ్‌ను వినియోగించుకుని, తనకున్న సమయస్ఫూర్తి మరియు ఇతరత్ర పాజిటివ్‌ పాయింట్స్‌తో సీజన్‌ 2ను సూపర్‌ హిట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ బిగ్‌ బాస్‌ 2ను ప్రసారం చేసేందుకు స్టార్‌ మా సిద్దం అయ్యింది. గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌లో ఎక్కువ రోజులు మరియు ఎక్కువ మంది సెలబ్రెటీలు. దాంతో షో మరింత ఆసక్తికరంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక నాని మొదటి నుండి మరింత మసాలా అంటూ టీజర్‌లో చెబుతూ వస్తున్నాడు. అందుకే అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈసారి సామాన్యులకు కూడా అవకాశం అంటూ ప్రకటన వచ్చింది. ఇప్పటికే కొందరిని ఎంపిక చేశారు. సెలబ్రెటీలతో సామాన్యులు కూడా ఈ షోలో పాల్గొంటున్న కారణంగా ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్‌ను మరిపించేలా నాని హోస్టింగ్‌ చేస్తాడా లేదా అనేది చూడాలి.