బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్. తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకు మంచి ఆదరణ లభిస్తుంది . ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తైన ఈషో.. ఇప్పుడు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది’ మొత్తం 19 మందితో స్టార్ట్ అవ్వగా .. ఇప్పుడు పది మంది మిగిలారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఇటు తెలుగులోనే కాకుండా అటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో బిగ్బాస్ షో నడుస్తోంది. తెలుగుకు నాగార్జున, హిందీకి సల్మాన్ ఖాన్, కన్నడ కిచ్చ సుదీప్, తమిళం కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తు ఉన్నారు . అయితే బిగ్బాస్ నియమ నిబంధనల ప్రకారం ఈ షోలో కంటెస్టెంట్స్ అందరూ స్థానిక భాష మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హిందీ బిగ్బాస్ షోలో ఇద్దరు కంటెస్టెంట్ తెలుగులో మాట్లాడుకుంటుండగా.. తెలుగు బిగ్బాస్ షోకు మీకు స్వాగతం అంటూ ఫన్ క్రియేట్ చేశాడు బిగ్బాస్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
అసలు విషయం లోకి వస్తే.. ప్రస్తుతం హిందీలో సీజన్ 17 ఆసక్తికరంగా సాగుతోంది . ఇటీవల నామినేషన్లలో భాగంగా హీరోయిన్ మన్నారా చోప్రా, అరుణ్ శ్రీకాంత్ మాషెట్టీ ఇద్దరూ తెలుగులో సవాలు విసురుకుంటూ ఉన్నారు . నామినేషన్స్ సమయంలో అరుణ్ మాట్లాడుతూ.. చెద్దాం చెద్దాం అన్నీ చెద్దాం అని అనగా.. నాకు నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు అని మన్నారా చోప్రా మాట్లాడింది. దీంతో బిగ్బాస్ తెలుగు షోకు అందరికీ స్వాగతం అంటూ వెల్కమ్ చెప్పారు బిగ్బాస్. దీంతో కంటెస్టెంట్ అంతా ఠక్కున నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. హిందీ బిగ్బాస్ షోలో తెలుగు మాట్లాడటం సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అంతకుముందు పలుమార్లు కంటెస్టెంట్లకు హైదరాబాద్ లైఫ్ స్టైల్, తెలుగు భాషను నేర్పిస్తున్న వీడియోస్ సైతం ఎప్పుడు
నెట్టింట వైరలయ్యాయి..