Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని గవర్నర్ ఆమోదించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని కోరారు. హఠాత్తుగా నితీష్ రాజీనామా చేయడంతో బీహార్ లో, ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన మహాకూటమిలో ముసలం పుట్టినట్టు అయ్యింది. ఈ ముసలం బయటపడకుండా చూసేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంటే సాక్షాత్తు సోనియా, రాహుల్ కలగజేసుకున్నా ఫలితం లేకపోయింది.
ఇటీవల లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ మీద సిబిఐ దాడులు, కేసుల నేపథ్యంలో ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించాలని నితీష్ భావించారు. అయితే వాళ్ళే రాజీనామా చేస్తే బాగుంటుందని సూచించినా లాలూ వర్గం ఒప్పుకోలేదు. కాంగ్రెస్ తోను ఇదే విషయం చెప్పి లాలూ కొడుకుతో రాజీనామా చేయించాలని నితీష్ కోరారు. అయినా ఫలితం లేకపోవడంతో నితీష్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయితే రాజీనామా తర్వాత మాత్రం ఈ విషయాలు బయటికి చెప్పకుండా నితీష్ సంయమనం పాటించారు. బీజేపీ తో పొత్తుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అవకాశాల్ని ఆయన తోసిపుచ్చకపోవడంతో బీహార్ లో కొత్త రాజకీయాలకు తెర లేచింది.
మరిన్ని వార్తలు