Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సీఎం కుర్చీని టార్గెట్ చేస్తే.. చివరకు చెరసాలే మిగిలింది. శశికళ స్టోరీ వింటే ఎవరైనా పాపం చిన్నమ్మ అనుకోవాల్సిందే. జయలలిత నీడన రాణిలా వెలిగిన శశికళ.. సీఎం పదవి ఆశించడంతో ఎన్నో తప్పులు చేయాల్సి వచ్చింది. చివరకు జయను చంపేశారనే అపఖ్యాతి వచ్చింది. శశికళే అమ్మను చంపేశారని తమిళనాడులో 90 శాతం మంది అభిప్రాయపడుతున్నారంటే.. ఇక చిన్నమ్మ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్లే.
వేద నిలయంలో మహారాణిలో భోగాలు వెలగబెట్టిన శశికళ.. ఇప్పుడు జైల్లో కూడా రేంజ్ తగ్గించడం లేదు. మధ్యలో ఓ లేడీ ఆఫీసర్ పుణ్యమా అని కొద్దిరోజులు సాధారణ జైలు జీవితం గడిపినా.. మళ్లీ మామూలైపోయిందట పరిస్థితి. ముఖ్యంగా పరప్పన అగ్రహార జైలును శశి పుట్టినరోజు కోసం ముస్తాబు చేస్తున్న తీరు చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.
బెంగళూరులోనే మకాం వేసిన మన్నార్ గుడి మాఫియా తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. జైలు అధికారుల్ని కొనేసి.. జైల్లో కొన్ని గదుల్ని ఆదీనంలోకి తీసుకుని సెలబ్రేషన్స్ చేస్తోంది. ముఖ్యంగా ఈ వేడుకల ద్వారా చిన్నమ్మ స్థాయి తెలియజెప్పాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఉంది కాబట్టి సరిపోతోంది. రేపు ఎన్నికల తర్వాత బీజేపీ సర్కారు వస్తే.. చిన్న్మమకు చిప్పకూడే గతని విమర్శకులు మండిపడుతున్నారు.
మరిన్ని వార్తలు: