Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వీ6లో ప్రసారం అయ్యే తీన్మార్ వార్తలు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక అందులో ప్రతి రోజు అయిదు నిమిషాల పాటు వచ్చే బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయనకు తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా అభిమానులు ఉన్నారు. ఈయన చేష్టలతో నవ్వించడంతో పాటు, ఆలోచింపజేస్తాడు. సినిమాల్లో అవకాశాల కోసం దాదాపు పది సంవత్సరాలు కష్టపడ్డ బిత్తిరి సత్తి పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. రుద్రమదేవి చిత్రంలో కొన్ని నిమిషాలు కనిపించే పాత్రను చేశాడు. బిత్తిరి సత్తి అసలు పేరు చేవ్లె రవి. ఈ రెండు సంవత్సరాల్లో రవికి స్టార్ ఇమేజ్ దక్కింది.
పలు సినిమాల్లో ఆఫర్లు రావడంతో పాటు, పలు షోలకు ఈయన హాజరు అవుతున్నాడు. తాజాగా బిత్తిరి సత్తి చేతిలో అయిదు సినిమాలున్నట్లుగా సమాచారం. సినిమాలతో చాలా బిజీ అయిన బిత్తిరి సత్తి తీన్మార్కు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాలను, తీన్మార్ను మ్యానేజ్ చేయడం ఇబ్బందిగా ఉందని, తీన్మార్కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ప్రతి రోజు కూడా తీన్మార్కు స్కిట్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో షూటింగ్ ఉంటే ఇబ్బంది అవుతుంది. అందుకే తీన్మార్ను వదిలేస్తాడని సమాచారం. కాని సత్తి తీన్మార్ను వదిలేయవద్దని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. సినిమాల కంటే కూడా ముఖ్యం తీన్మార్ అని, సత్తికి గుర్తింపు తీసుకు వచ్చిన తీన్మార్ను వదిలేయడం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.