Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అన్నీ ఉన్నమ్మ అణగిమణిగి ఉంటే.. ఏమీ లేనమ్మ ఎగిరెగిరిపడిందట. ఇప్పుడు ఏపీ బీజేపీ పరిస్థితి కచ్చితంగా అలాగే ఉంది. టీడీపీతో పొత్తు లేకుండా ఓ వార్డులో కూడా విజయం సాధించే బలం లేని కాషాయ నేతలు.. టీడీపీతో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేయాలని అమిత్ షాకు చెబుతున్నారట. ఇలాగే తప్పుడు సలహాలు విని గుజరాత్ లో పప్పులో కాలేసిన అమిత్ షా.. ఈసారి మాత్రం కాస్త తెలివిగా వ్యవహరిస్తున్నారు.
నంద్యాల బైపోల్ రిజల్ట్ వచ్చాక ఆలోచిద్దామని టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలకు సర్దిచెప్పారట. అంతకుమించి షా చేసేదేమీ లేదు. అమిత్ షా మోడీ వ్యూహాలకు కొత్త మిత్రులు భయపడుతున్నారు. పాత మిత్రుల్ని కూడా దూరం చేసుకుంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. మొన్నటి ఎన్నికల్లో కీలకంగా ఉన్న యూపీలో చిన్నారుల మరణాలు మోడీని కలవరపెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వాటి ప్రభావం ఉంటుందని ఆయన భయపడుతున్నారు.
ఏరికోరి సీఎం సీటులో యోగిని కూర్చోబెడితే ఇలా చేశారేంటని మథనపడుతున్నారు. ఇలాంటి సమయంలో మిత్రులపై దూకుడుగా వెళితే అసలుకే ఎసరు తప్పదని అమిత్ షాకు చెప్పారట. అందుకే షా కూడా నంద్యాలలో టీడీపీ గెలిస్తే ఒకలా, వైసీపీ గెలిస్తే మరోలా మాట్లాడటానికి ఫలితాలు రాగానే ఏపీ టూర్ పెట్టుకున్నారు. ఏదేమైనా బీజేపీకి వెర్రి పీక్స్ కు చేరిందనేది వాస్తవం.
మరిన్ని వార్తలు: