Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జి రాంమాధవ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి జానకిదేవి కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె అంత్యక్రియలు రేపు హైదరాబాదులో జరగనున్నాయి. ఈ సందర్భంగా రామ్ మాధవ్ కు పలువురు బిజెపి నేతలు సంతాపం తెలిపారు. కర్ణాటకలో హంగ్ ఏర్పడటంతో రాంమాధవ్ అక్కడ కాంగ్రెస్, జేడిఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ లోనికి తెచ్చే పనిలో ఉండగా ఈ వార్త తెలిసింది. ఇటువంటి వ్యవహారాలలో రాంమాధవ్ దిట్ట. గతంలో త్రిపుర, అస్సాం, నాగాల్యాండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఆయన పార్టీకి మద్దతుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయించారు. కర్నాటక లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పరువు సమస్యగా భావించి బీజేపీ ఉన్న కీలక సమయంలో ఆయనకు మాతృ వియోగం కలగడం బాధాకరమని కొందరు బీజేపీ నేతలు అనుకుంటున్నారు.