Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అవినీతి మీదనే పోరాటం అంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ తర్వాత తర్వాత ఎన్ని చేసినా పెద్దగా పట్టించుకోలేదు జనం. ఎప్పుడయితే నోట్ల రద్దు అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడో అప్పటి నుండి మోడీకి వ్యతిరేకత మొదలయ్యింది. అయితే అప్పటికే భాజపాకి కోపం తెప్పిస్తే ఎప్పటివో కేసులు తోడించి లాలూ లాంటి వాళ్ళని ఊచల వెనక్కి తోయ గలరు, అదే వారికి కావాలనుకున్న వారికి అయితే ఎన్ని కేసులు ఎన్ని ఆరపణలు ఉన్నా బయటకి వచ్చేస్తారు దానికి నిదర్శనంగా మన్మోహన్ హయాంలో అవినీతికి పాల్పడినట్లు కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఒక్కరొక్కరుగా మోదీ హయాంలో క్లీన్ చిట్ లతో బయటకు వచ్చేస్తున్నారు. టూజీ స్కాం లో ఇప్పటికే సాంకేతిక కారణాలతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిందితులు బయటకి వచ్చేశారు.
ఇక ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి వంతు వచ్చింది. అక్రమ మైనింగ్ అక్షరాలా నిజమని కర్ణాటక లోకాయుక్త నిర్ధారించి… ఆధారాలతో సహా నిరూపిస్తే… ఇప్పుడు సీబీఐ దానిని సిల్లీ రీజన్స్‌తో తేల్చి పడేసే ప్రయత్నం చేసింది. భాజపాకు మేలు చేస్తే చాలు ప్రస్తుతం దేశంలోనే అత్యున్నత నేర విచారణ సంస్థ అయిన సీబీఐ విచారణలో ఉన్న కేసులు కూడా మాటు మాయం అయిపోతాయి ఇందుకు కర్నాటక ఎన్నికల్లో చక్రం తిప్పుతున్న గాలి జనార్దనరెడ్డి ఉదంతమే ఉదాహరణ. అవినీతి ఆరోపణలు ఉన్న గాలిని భాజపాలోకి తిరిగి తీసుకునేది కూడా లేదంటూ అమిత్ షా తెగేసి చెప్పినా… ఆయన వర్గానికి దాదాపు పది టికెట్లదాకా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గాలి పై కేసులు నీరుగార్చే పరిస్థితి ఏర్పడుతోంది.
గాలి జనార్థన్ రెడ్డి కర్ణాటక, గోవాలో ఎప్పుడెప్పుడు మైనింగ్ చేశారో, తవ్వి తీసిన ఖనిజాన్ని ఏవిధంగా తరలించారో అనేది స్పష్టంగా చెప్పడం కష్టమంటూ సీబీఐ కోర్టుకు దాఖలు చేసిన పత్రాల్లో పేర్కొందట. ఈ డాక్యుమెంట్స్ ని గత ఏడాదే కోర్టులో సీబీఐ సమర్పించినప్పటికీ, వీటిలోని పొందుపరిచిన ఈ వివరాలు ఇంతవరకూ బయటకి రాలేదు. వీటిని తాజాగా జర్నలిస్ట్ భర్కాదత్ బయటపెట్టడం విశేషం.
ఈ మధ్యనే… గాలి జనార్థన్ రెడ్డి అవినీతిని క్షమించేస్తున్నా అంటూ సీఎం అభ్యర్థి ఎడ్యూరప్ప వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ప్రచార నేపథ్యంలోనే… భాజపా అధ్యక్షుడు అమిత్ షా కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ… ఎడ్యూరప్పతో సహా కొంతమందిపై అవినీతి ఆరోపణలున్నాయనీ, కానీ నిరూపణ జరగలేదన్నారు. ఇంకేముంది… గాలి జనార్థన్ రెడ్డికి త్వరలో క్లీన్ చిట్ వచ్చేసి ఆయన బీజేపీలో మళ్ళి యాక్టివ్ మెంబర్ అయ్యి ఇక ఏ ఎమ్మెల్సీనో తీసుకుని ఒకవేళ పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే మంత్రి కూడా అవ్వచ్చు.