తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీ తర్వాత జరిగే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టంగా సమాచారం అందుతుంది.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలోకి భారత రాష్ట్ర సమితి పార్టీ లో టికెట్లు రానివారు వచ్చి చేరుతున్నారు. ఇక కొంతమంది బీజేపీ నేతలు అధికార పార్టీలోకి వస్తున్నారు. ఈ తరుణంలోనే.. భారత జనతా పార్టీ నేత అయిన వి6 వివేక్ వెంకటస్వామి త్వరలోనే భారత రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పెద్దపల్లి ఎంపీ టికెట్ వి6 వివేక్ కు ఇస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో వి6 వివేక్ మళ్లీ గులాబీ కండువా కప్పుకో నున్నారని సమాచారం.