ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ జరుగుతుండగా హగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. పార్లమెంటులో చోటు చేసుకున్న ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ ఇచ్చిన ‘హగ్’ వ్యవహారం ఇప్పటిలో ఆగేలా లేదు. మోడీని కౌగిలించుకోవాలనేది అప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదనీ, కొన్ని నెలలుగా రాహుల్ గాంధీ ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారంటూ రాహుల్ తాలూకా కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. కొన్నాళ్ల కిందట రాహుల్ కుటుంబ సభ్యులను ప్రధాని తీవ్రంగా విమర్శించారు. అప్పుడే రాహుల్ ఈ నిర్ణయానికి వచ్చారట. మోడీ చేస్తున్న విమర్శలకు బహిరంగంగా తిప్పికొట్టాలంటే.. ప్రేమతో ఆయనకో హగ్ ఇవ్వాలని ఎదురుచూస్తూ వచ్చారట.
దేశం మొత్తం చుస్తున్నందున పార్లమెంట్ నే దానికి సరయిన వేదిక అని భావించి ఆయన హాగ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే రాహుల్ ఆలింగనం వెనక ఉన్న అసలు కథ ఇదే అంటూ బీజేపీ సరికొత్త కోణాన్ని చెప్పుకొచ్చింది. ఓ తాంత్రికుడి సలహా మేరకు మోదీని రాహుల్ కౌగిలించుకున్నారని బీజేపీ ఢిల్లీ ప్రతినిధి తేజిందర్ పల్ సింగ్ బగ్గా ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు సన్నిహితుడైన ఓ కాంగ్రెస్ ఎంపీ చెప్పారని పార్లమెంటులో ప్రసంగించడం ముగియగానే ప్రధాని సీటును తాకాలని ఆ మాంత్రికుడు రాహుల్‌కు చెప్పాడని, అందుకే రాహుల్ మోడీని కౌగించుకున్నారని అన్నారు. రాహుల్ ఆలింగనం వెనక ఉన్న అసలు రహస్యం ఇదేనని ఆయన వివరించారు.
అయితే నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్న మోడీ ఇప్పుడు తన సొంత పార్టీ నేతల దెబ్బకి వణికి పోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ రోజు రాహుల్ మోడీకి హాగ్ ఇవ్వగానే షాక్ తిన్నా వెంటనే తేరుకున్నా కంగ్రాట్స్ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ నేత చేసిన కామెంట్ కి మోడీకి నిజంగానే తాంత్రిక పూజల భయం పట్టుకుందట. నిజంగా రాహుల్ తాంత్రిక పూజల తర్వాతే అలా హాగ్ ఇచ్చుంటే గనుక ఈసారి తన పదవి పోవడం ఖాయం ! అనే భయం మోడీకి పట్టుకుందని సన్నిహిత వర్గాల సమాచారం. మొత్తానికి రాహుల్ హాగ్ మోడీ గుండెల్లో వణుకు పుట్టించిందన్నమాట.