ఆపరేషన్ గరుడ ! ఏపీ రాజకీయాల్లో గేమ్ స్టార్ట్ అయింది…బీజేపీ కీలక నేత

bjp leaders says they planned a new game in ap politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్నాటక ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ మీద ద్రుష్టి సారిస్తాం అని ముందు నుండి అంటున్నట్టుగానే బేజెపే ఇటు ఎపీతో పాటు తెలంగాణా మీద కూడా ద్రుష్టి సారించినట్టుగా తెలుస్తోంది. నాలుగేళ్లు కలిసి చట్టాపట్టాలేసుకొని తిరిగిన మోడీ-చంద్రబాబుల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఏకంగా మోడీని టార్గెట్ చేసి చంద్రబాబు జాతీయ రాజేకీయాల్లో కూడా తనకు వచ్చిన అవకశాలను వదులుకోవడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ విషయంలో బీజేపీ నేతల కుట్రలు చేయడానికి సైతం సిద్దం అవుతున్నారు. ఇప్పటికే కులాల వారీగా నాయకులని విడదీసి తమ వైపుకి తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలెట్టింది. అవన్నీ అంతగా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇప్పుడు అందుకే ప్లాన్ బీని అమలు చేయబోతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాని ప్రకారం… ‘ఏపీలో ఎవరు గెలిచినా.. తెలుగుదేశం పార్టీని మాత్రం అధికారంలోకి రానివ్వమని తెలంగాణలో కాంగ్రె్‌సకు విజయం దక్కకుండా ఏమైనా చేస్తాం‘ అనే తమ వైఖరిని బీజేపీ సీనియర్‌ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకరు శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడుతూ వెల్లడించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ వెళ్లిపోవాలనే బీజేపీ కూడా కోరుకుందని, అందుకే చంద్రబాబు వెళ్లిపోతుంటే ఆయను ఆపలేదని ఆయన పేర్కొన్నారు. ఏపీ రాజకీయాలను కొన్ని కీలక మలుపులు తిప్పెందుకే రాష్ట్ర శాఖ పాత అధ్యక్షుడితో రాజీనామా చేయించి.. కొత్త అధ్యక్షుడిని తీసుకొచ్చామన్నారు. ఆ రాష్ట్రంలో రాజకీయ క్రీడకు సన్నద్ధమవుతున్నామని చెప్పారు.

అంతేకాదు 2019లో చంద్రబాబు శీర్షాసనం వేసినా ముఖ్యమంత్రి కారని.. అప్పటికీ ఏపీని ఏం చేయాలో వ్యూహరచన చేశామని సదరు బీజేపీ నేత వ్యాక్యానించారు. 2019కు ముందు కాంగ్రెస్ కు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అనేకమంది నేతలను బీజేపీలో కలుపుకుంటామని.. ఏపీలో కాంగ్రెస్ మొక్క కూడా మొలవకుండా చేస్తామని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఇతర పార్టీల నుంచి పలువురు నేతలను కలుపుకొని 1984లో ఏపీలో ఎలా సంక్షోభం సృష్టించామో అలా చేసి చంద్రబాబుకు అధికారం దక్కకుండా చేస్తామని ఆయన ఈ విషయాలన్నీ ఆఫ్ ధీ రికార్డ్ గా చెప్పుకొచ్చారు. ఇక మరోపక్క తెలంగాణలో కాంగ్రె్‌సను అధికారంలోకి రాకుండా ఉండేందుకు అవసరమైన వ్యూహరచన చేస్తున్నామని బీజేపీ నేత చెప్పారు. అక్కడ బీజేపీ గెలవడమో, లేదా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడమో జరగాలి తప్ప.. కాంగ్రె్‌సకు అధికారం దక్కకూడదు అనేదే తమ పార్టీ వైఖరి అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ వరకు టీఆర్‌ఎ్‌సను తిట్టకపోతేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపితే.. తెలంగాణలో కాంగ్రెస్‌ మునుగుతుందని ఎందుకంటే ఆంధ్రా పార్టీతో చేతులు కలిపారన్న నిందను కాంగ్రెస్‌ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి యోచించడం సరైన వ్యూహమేనని వ్యాఖ్యానించారు. అయితే సదరు పేరు వెల్లడించకుండా వెలువడిన ఈ కధనం తెలుగులోని ప్రముఖ చానల్ , పత్రిక లో వెలువడడంతో ఇప్పుడు మరో మారు ఆపరేషన్ గరుడ తెర మీదకు వచ్చినట్టియింది. చాలా జాగ్రత్తగా ఆపరేషన్ గరుడని అమలుపరచిన IYR నుంచి రమణ దీక్షితులు దాకా అన్ని కుట్రలను తెలుగుదేశం బహిర్గతం చేసింది. అయితే ఇప్పుడు ఒక బీజేపీ నాయకుడు స్వయంగా ఈ వివరాలను మీడియాతో ఆఫ్ ది రికార్డు మాట్లాడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అనేక చర్చలకు దారి తీస్తోంది. కాంగ్రెస్, బీజేపీ లకు ప్రత్యామ్నయం అంటూ కేసీఆర్ మొదలుపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ సరయిన వ్యూహం అని ఆయన వెనకేసుకురావడం ఇదంతా కూడా బీజీపీ ఆపరేషన్ గరుడలో భాగమేనా అనే అనుమానాలని రేకెత్తిస్తోంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.