Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నోటాకు ఓటువేయాలంటూ బీజేపీ నేతలే ప్రచారం చేయడం ఇప్పుడు కర్నాటక ఎన్నికల్లో ఆసక్తి రేపుతోంది. తమ కమలానికి కాకుండా నోటాకి వోటేయ్యాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి అభ్యర్థి యద్యురప్ప అనుచరవర్గం కోరడం ఇప్పుడు కన్నడ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అధిష్టానం యాడ్యురప్ప కుమారునికి టికెట్ నిరాకరించడంతో ఆయన అనుచరులు ఇప్పుడు పార్టీ వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. టికెట్ దక్కించుకున్న బీజేపీ అభ్యర్థికి కాకుండా.. నోటాకు ఓటు వేయాలని వారు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ నుంచి సిద్ధరామయ్య ప్రాతినిథ్యం వహిస్తుండగా, ఈ సారి వరుణ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు పోటీ చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పోటీలో ఉందామని ఆశించిన యాడ్యురప్ప కుమారుడు విజయేంద్రకు బీజేపీ అధిష్టానం షాకిస్తూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే వర్గంలోని బసవరాజు అనే వ్యక్తికి టికెట్ ఇచ్చింది.
ఈ నిర్ణయంతో యద్యురప్ప, విజయేంద్రలు అలకబూనగా.. అధిష్టానం ‘హామీతో’ వారి శాంతించినట్టు ఉంటూ తమ అనుచరుల చేత హెగ్డే, బసవరాజుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తునారు. హెగ్డేని ఉద్దేశించి.. సిద్ధరామయ్య కుమారుడిని గెలిపించడానికి ఎంత నగదు తీసుకున్నారంటూ కరపత్రాలు పంచుతున్నారు. ఓట్లన్ని నోటాకే వేయాలని.. దీంతో ఒకవేళ తమ టైం బాగుంది నోటాకి ఎక్కువ వోట్లోస్తే అక్కడ తిరిగి ఎన్నికలు నిర్వహిస్తే విజయేంద్రకు టికెట్ దక్కుతుందని వారు భావిస్తున్నారు. అయితే తమ అనుచరుల చేత యద్యురప్ప చేయిస్తున్న ఈ పనులు అధిష్టానం దృష్టికి చేరిందని తెలుస్తోంది. అయితే వారు వ్యూహాత్మక మౌనం పాటిస్తుండటం ఇప్పుడు కన్నడ రాజకీయ వర్గాలో హాట్ టాపిక్ అయ్యింది.