మరుగుదొడ్లు కూడా వదలరా ?, సీఎం రమేష్ ని గిన్నీస్ బుక్ ఎక్కించాలి

bjp mla vishnu Kumar raju comments on chandrababu and cm ramesh

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు మీద ఇటీవలే ఏపీ బీజేపీ అధ్యక్షుడు గా భాద్యతలు చేపట్టున కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మోసగాడని ప్రధాని నరేంద్ర మోదీ ముందు తెలుసుకోలేకపోయాడని పేర్కొన్నారు. టీడీపీ నేతలు అన్నింటిలోనూ అవినీతికి పాల్పడుతున్నారని, చివరికి మరుగుదొడ్ల నిర్మాణంలోనూ అవినీతి చేశారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రం ఇప్పటివరకు రూ. లక్ష 55 వేల కోట్ల నిధులను రాష్ట్రానికి ఇచ్చిందని వివరించారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.16,800 కోట్లు ప్రకటించగానే చంద్రబాబు కేంద్రాన్ని కొనియాడారని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత దోపిడీ సర్కారుని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

కేంద్ర సర్కారు మంజూరుచేసిన పక్కా ఇళ్ల నిర్మాణంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పించారు. ఏపీలో అవినీతి, అరాచకాలే ఉన్నాయని, మంచి పాలన లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మరోపక్క బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా చంద్రబాబు మీద ప్రశంసలు, టీడీపీ నేత సీఎం రమేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. షుగర్ వ్యాధి గ్రస్తులు ఒకట్రెండు రోజులే తినకుండా ఉండలేరని, అలాంటిది సీఎం రమేష్ పదకొండు రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేయడం సాధారణ విషయం కాదని, ఈ దీక్షను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలంటూ వ్యంగ్యంగా అన్నారు. రమేష్ వల్ల దీక్షలపై ప్రజల్లో ఉన్న నమ్మకం పోయిందని విమర్శించారు. కాగా, ఏపీలో హోంగార్డుల కష్టాలు గుర్తించి వారి జీతాలు పెంచినందుకు సీఎం చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్పకు ధన్యవాదాలు తెలిపారు.