అవసరానికి బీజేపీ నాటకాలు

BJP Strategies For TDP In Politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంద్యాలలో ఎందుకు బీజేపీని దూరం పెడుతున్నామో చంద్రబాబు క్లియర్ గా చెప్పారు. మైనార్టీ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి రిస్క్ చేయలేమన్నారు. అయినా సరే అర్థం చేసుకోకుండా టీడీపీపై కారాలు మిరియాలు నూరారు బీజేపీ నేతలు. కానీ కాకినాడ వచ్చేసరికి సీన్ మార్చేశారు. తమకు టీడీపీని మించిన మిత్ర పక్షం లేదని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

టీడీపీ అవమానిస్తోందన్న బీజేపీ నేతలు కూడా.. కాకినాడ వచ్చి రెండు పార్టీలూ గెలుస్తాయని ఢంకా బజాయిస్తున్నారు. పైగా ఎప్పట్నుంచో టీడీపీతో పొత్తు వద్దని మొత్తుకుంటున్న పురంధేశ్వరి కూడా.. వైసీపీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చడం చర్చనీయాంశంగా మారింది. మిత్రపక్షంలో శత్రువుల్ని కూడా బాబు బాగానే దారికి తెచ్చారని తమ్ముళ్లు మురిసిపోతున్నారు.

కానీ కాకినాడలో తొమ్మిది కార్పొరేటర్ సీట్లలో గెలుపు కోసమే నాటకమాడుతున్నారా.. నిజంగా బీజేపీ టీడీపీతోనే ఉంటుందా అన్న అనుమానాలు మాత్రం టీడీపీ సీనియర్లకు వస్తున్నాయి. ఎందుకైనా మంచిదని బీజేపీ క్యాంపైనింగ్ ను ఓ కంట కనిపెడుతున్నారు. ఎంత గింజుకున్నా ఏఫీలో పుంజుకునే ప్రసక్తే లేదని గ్రహించిన అమిత్ షా కూడా.. ఏపీలో కొత్త పొత్తులు అవసరం లేదని చెప్పడం చిన్న విషయం కాదు.