Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
BJP Warns Rajinikanth About Political Party
దువ్వాలన్నా మేమే, గోతులు తవ్వాలన్నా మేమే అన్నట్లుగా ఉంది కమలనాథుల రాజకీయ ఎత్తు. ఓవైపు రజనీకాంత్ ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తూనే.. మరోవైపు సొంత పార్టీ పెడితే ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే భారీ ఆయుధాలు తమ దగ్గరున్నాయని చెప్పడం పొలిటికల్ పండిట్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.ఎంతైనా అమిత్ షా అధ్యక్షుడయ్యాక బీజేపీ గేమ్ ప్లాన్ లో భారీ మార్పులు వచ్చాయి.
మైత్రి కోసం ఎంతగా పాకులాడతారో.. చెప్పిన మాట వినకపోతే అంతేస్థాయిలో శత్రుత్వం పెట్టుకుంటారని తేలిపోయింది. పరిస్థితి చూస్తుంటే సుబ్రహ్మణ్యస్వామిని బీజేపీ తమ పావుగా వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. రజనీ బీజేపీలో చేరకుండా సొంత పార్టీ పెట్టడం కాషాయ వర్గాలకు అస్సలు ఇష్టం లేదు. దీంతో రజనీ అవినీతిని తవ్వి తీస్తామని స్వామి భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తోంది.
రజనీ సొంత పార్టీ పెట్టినా తన చెప్పు చేతల్లో ఉండాలనేది బీజేపీ భావన. రజనీ కూడా ముందుజాగ్రత్తగా ఎన్డీఏలోనే ఉంటానని చెబుతున్నారు. కానీ తనకు జూనియర్ భాగస్వామిగా రజనీ ఉండాలని బీజేపీ హెచ్చరిస్తోంది. ఏమాత్రం తేడా వచ్చినా, మాట వినకపోయినా.. అడ్రస్ గల్లంతు చేస్తామని వార్నింగ్ ఇస్తోంది. మరి బీజేపీ వ్యవహారశైలితో.. రజనీ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరమే.