రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటిలోనే స్టార్ హీరో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి ఇతనికి ఇండస్ట్రీలో సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా విజయాన్ని సాధించలేకపోయాయి. చాలా రోజులకి ‘ఖుషి’ మూవీ మంచి సక్సెస్ ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఖుషి హిట్ అయిన సంతోషంలో విజయ్ దేవరకొండ వంద కుటుంబాలకి కలిపి కోటి రూపాయలు ఇస్తానంటూ ప్రకటించాడు.
ఇక అతను ఆ విషయం ప్రకటించిన వెంటనే ఓ నిర్మాణ సంస్థ కౌంటర్ కు దిగింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను తీసి ఎనిమిది కోట్లు పోగొట్టుకున్నాము. దానిపై ఎవరు స్పందించడం కూడా లేదు. ఎలాగో విజయ్ దేవరకొండ 100 కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానని చెప్పాడు కాబట్టి అలాగే డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు కుటుంబాలను ఆదుకుంటారని ఆశిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఇది చూసిన విజయ్ కు ఆందోళన నెలకొంది. ఇలా పబ్లిక్ గా డబ్బులు ఇవ్వాలని టార్గెట్ చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ తండ్రి స్పందించారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఆడనప్పుడు విజయ్ తన రెమ్యూనరేషన్ లో సగం భాగాన్ని ఇచ్చేశాడు. తనకు ఫ్లాట్ ఇస్తానని ఆఫర్ చేసినప్పటికీ వద్దని చెప్పాడు. ఇంతకంటే విజయ్ ఏం చేయగలడు. అయినా వారికి నష్టం వస్తే విజయ్ ఏం చేస్తాడు అని అన్నారు .
అభిషేక్ చాలా కాలం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ విషయాలేవీ విజయ్ కి తెలియవు. అలాంటిది ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా నా కొడుకు పేరు ప్రస్తావిస్తూ కామెంట్ చేశారు. అభిషేక్ నా కొడుకుని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు. కానీ అది అతని వల్ల కావడం లేదు. అభిషేక్ ఓసారి విజయ్ ని ఆకాశానికి ఎత్తుతాడు. అతని డేట్స్ కావాలి సినిమా చేస్తాను అంటారు. మరోసారి మార్కెట్ ఇమేజ్ పడిపోయిందని అంటాడు అతని మాటలకు అస్సలు పొంతన కుదరడం లేదు. అతనితో సినిమా చేయడానికి విజయ్ సిద్ధంగా లేడు. ప్రస్తుతం వరుస సినిమాలతో విజయ్ బిజీగా ఉన్నారు. అతని డేట్స్ కూడా ఖాళీగా లేవు అని విజయ్ తండ్రి చెప్పారు.