బాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్.. సింగర్ అయిన వాజిద్ ఖాన్ కన్నుమూశాడు. ముంబైలోని ఓ ఆస్పత్రితో చికిత్స పొందుతూ వాజిద్ ఖాన్ మరణించారు. బాలీవుడ్‌లో వాజిద్ ఖాన్ సాజిద్-వాజిద్ పేరిట సంగీతాన్ని సమకూర్చారు. వాజిద్ ఖాన్ గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే సోమవారం తెల్లవారుజామున ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
కాగా వాజిద్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వాజిద్ ఖాన్ మృతి తీరని లోటు అని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా, జోనాస్ దంపతులు ట్వీట్ చేశారు. వాజిద్ ఖాన్ నవ్వును మేమెప్పుడూ మర్చిపోలేం.. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాజిద్ భాయ్ మృతి పట్ల వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నామని ప్రియాంకచోప్రా దంపతులు తెలిపారు.