Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొడుకు చేతికి అంది వస్తే ఏ తండ్రైనా సంతోషిస్తాడు. కళ్లు మూసుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగిస్తాడు. అదే పని రేమండ్స్ అధిపతి విజయ్ పథ్ సింఘానియా చేశారు. కొడుకును దగ్గరపెట్టుకుని ట్రైనింగ్ ఇచ్చి మరీ తనంతటి వాడ్ని చేశారు. పైగా తన వాటాకు వచ్చిన వెయ్యి కోట్ల షేర్లు కూడా కొడుకు మీద నమ్మకంగా బహుమతిగా ఇచ్చాడు. అదే ఆయన పాలిట శాపమైంది.
విజయ్ పథ్ సింఘానియా కొడుకు గౌతమ్ సింఘానియా తండ్రి నుంచి పవర్ రాగానే మారిపోయాడు. అప్పటిదాకా తండ్రి మాట జవదాటని కొడుకు డబ్బులు చేతికి రాగానే తండ్రినే అద్దింట్లో పెట్టాడు. పైగా భరణం కూడా ఇవ్వకుండా ఏడిపించాడు. దీంతో దిక్కులేని తండ్రి కోర్టును ఆశ్రయించాడు. దీంతో రేమండ్ సామ్రాజ్యం పరువు బజార్న పడింది.
ఇంత జరిగాక కూడా గౌతమ్ లో మార్పు రాలేదు. తన తండ్రి తాను కష్టపడ్డాడు కాబట్టే వెయ్యి కోట్ల షేర్లు ఇచ్చాడని, తనకు కాక ఇంకెవరికి ఆస్తి ఇస్తారని చెబుతున్నాడు. కానీ తండ్రిని ఎందుకు చూడలేదనే ప్రశ్నకు మాత్రం జవాబివ్వడం లేదు. అంటే స్వార్థపరులైన కొడుకులు ధనవంతులైనా.. వారు తమ తల్లిదండ్రుల్ని ఆదరించరనే విషయం ఓ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కే ఎదురైన దారుణమైన సందర్భమిది.
మరిన్ని వార్తలు: