పబ్జీ ఆడవద్దన్న తల్లి.. 11వ అంతస్తునుంచి దూకి కొడుకు ఆత్మహత్య

హైదరాబాద్ లోని మాదాపూర్ ఘోరం జరిగింది. ఎక్కువసేపు పబ్జీ ఆడుతుండటంతో వారించిన తల్లి మాటలకు మనస్తాపం చెందిన కొడుకు ఏకంగా 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోజు ఎక్కువ సమయం సెల్‌ఫోన్లో గేమ్స్ ఆడుతున్న కొడుకును తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు రాత్రివేళ 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా పబ్జీ గేమ్ మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. కొడుకు ఎప్పుడూ సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడుతూనే ఉండటంతో కోపంతో తల్లి మందలింని ఫోన్ లాగేసుకుంది. దీంతో తీవ్రంగా మనస్తాపానికి గురైన బాలుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మాదాపూర్ లోని ఖానామెట్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివసిస్తున్న వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వారి కుమారుడు(13) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్ తో అంతా ఇంటికే పరిమితమయ్యారు. స్కూల్స్ కూడా మూతపడ్డాయి.

దీంతో బాలుడు సెల్‌ఫోన్‌లో పబ్జీ గేమ్ ఆడుతూ దానికి బానిసయ్యాడు. రోజంతా ఆ గేమ్ ఆడుతూ సరిగా తిండి కూడా తినడం లేదు. దీంతో తల్లి గమనించి గట్టిగా మందలించింది. సెల్‌ఫోన్ లాక్కుని ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో 11వఅంతస్తులోని బాల్కనీ నుంచి కిందికి దూకేశాడు. శబ్ధం రావడంతో సెక్యూరిటీ గార్డు్లు వచ్చి చూడగా బాలుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో వెంటనే తల్లిదండ్రులకు తెలిపారు. తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.