సీఎం బాలయ్య…నిజం చేస్తున్నాడట !

Boyapati Balayya Movie New Update

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. బాలయ్య కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న సమయంలో సింహా, లెజెండ్ చిత్రాలతో ఆయనకు మరిచిపోలేని విజయాలు అందించాడు బోయపాటి. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌ అంటే మాస్ ప్రేక్షకులకు ఎప్పుడూ పండగే. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి.. ఇద్దరూ నిరాశలో ఉన్నారు. బాలయ్య నటించిన కథానాయకుడు, బోయపాటి డైరెక్షన్ చేసిన వినయ విధేయ రామ చిత్రాలు సంక్రాంతి కానుకగా వచ్చి ప్లాపయ్యాయి. ఇప్పుడు వీరిద్దరు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు. బోయపాటి శ్రీను తన గత చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథను బాలయ్య కోసం రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారని టాక్. సింహా, లెజెండ్ తరహాలోనే ఇందులోనూ బాలయ్య ద్విపాత్రాభియం చేయనున్నట్లు తెలుస్తోంది. మహానాయకుడు విడుదల తర్వాత బాలయ్య, బోయపాటి మూడో చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం. వరుస హిట్లతో అగ్ర దర్శకుడిగా ఎదిగిన బోయపాటిని ‘వినయ విధేమ రామ’ చిత్రం పాతాళానికి తొక్కేసింది. కథలో కొత్తదనం లేకపోవడం, లాజిక్ లేని యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. దీంతో సినిమా విడుదల తర్వాత కొద్దిరోజులు ఆయన కనీసం ఎక్కడా కనిపించలేదు. చేదు ఫలితాన్ని మరిచిపోయేందుకు బాలయ్యతో తన నెక్ట్స్ సినిమా పనుల్లో బిజీగా మారిపోయాడట బోయపాటి.