ఏపీ డీజీపీ సహా…ఆ ఇద్దరు పోలీసులని తప్పించండి !

Central Election Commission Send Notice To YS Jagan

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. వైసీపీకి చెందిన సీనియర్ నేతలు, ఎంపీలతో జగన్ సోమవారం డిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిశారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తూ ఓటరు జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని సీఈసీకి ఫిర్యాదు చేశారు. సర్వేల పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రభుత్వ టీమ్‌లు వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు తమ వద్దనున్న సాక్ష్యాధారాలను కమిషనర్‌కు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎలా వెక్కిరిస్తుందో సీఈసీకి వివరించామని, ఓటర్ల జాబితాను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, ప్రభుత్వ వ్యవస్థలను ఎలా తమకు అనుకూలంగా ఎలా వాడుకుంటున్నారో తెలిపామని అన్నారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది ఓటర్లుంటే అందులో సుమారు 60లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి.

ఇవన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారివే. వీటిని పట్టించుకోని ప్రభుత్వం ప్రజా సాధికార సర్వే, పరిష్కార వేదిక పేరుతో డేటాను కలెక్ట్ చేసి… అందులో వైసీపీ అనుకూల ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో 37మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తే అందులో 35మంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారేనని ఎన్నికల్లో తన సామాజిక వర్గం అధికారులను వాడుకునేందుకు చంద్రబాబు ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ వత్తాసు పలుకుతున్న తీరునూ వివరించామని ఎన్నికలు సక్రమంగా జరగాలంటే డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్ కో ఆర్డినేషన్ డీఐసీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరామని చంద్రబాబు నాలుగున్నరేళ్లలో సంపాదించిన అక్రమార్జనలో రూ.4వేల కోట్లు నగదును నియోజవర్గాల్లో పంచేందుకు తరలించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని జగన్ తెలిపారు.