మీద పడి రేప్ లు చేయరుగా ?

Hema Comments On Casting Couch

మన అవసరాలు తీరడం కోసం తప్పు చేసి ఇండస్ట్రీకి రావడం వల్లే ఇలా జరిగిందని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. ఓ యూట్యూబ్ ఛానల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు హేమ. ఇండస్ట్రీ నువ్ తప్పు చేయమని చెప్పదు. నా వరకూ నేను నాకు నచ్చి ఇండస్ట్రీకి వచ్చాను. నెల వచ్చేసరికి ఇంటి అద్దె కట్టుకోవాలి. మంచి తిండి తినాలి. కార్ కావాలి.. సెల్ ఫోన్ కావాలి. నా లగ్జరీ కోసం నేను తప్పు చేసి అది వేరే వాళ్ల మీదకి నెట్టడం కరెక్ట్ కాదన్నారామె. మన కెరియర్ కోసం ఏదో చేసుకోవడం అది తప్పని కూడా నేను అనుకోవడం లేదు. అవసరాలు తీర్చుకోవడం కోసమే ఆ పని. మన కెరియర్ కోసం మనం ఏదో చేసుకుని ఇప్పుడు మీటూ వాడు నన్ను గోకాడు వాడు ఇలా అన్నాడు వీడు ఇలా అన్నాడు అని అనడం, ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదని ఆమె అన్నారు.

ఇండస్ట్రీకి వస్తామని నా దగ్గరకు వచ్చే అమ్మాయిలకు నేను వద్దనే చెప్తానని నా ఫ్రెండ్ ఒకరు వచ్చారు. ఆమెకు కూడా వద్దనే చెప్పానని తీరా వచ్చాక అలా చేశారు ఇలా చేశారు అంటారని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారమో నేను సాయం చేస్తా అని చెప్పినా వినకుండా ఇండస్ట్రీకి వచ్చారు. ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లు, కుర్రాళ్లు ఎవరైనా రేప్‌లు చేశారా? దొంగతనాలు చేశారా?. కనీసం ఇండస్ట్రీకి చెందిన వాళ్లకి పెళ్లిళ్లు కూడా కావడం లేదు. ఆ మహాతల్లి (శ్రీరెడ్డి) పెట్టిన ఫిటింగ్‌కి ఇండస్ట్రీ అమ్మాయిలకు కనీసం అద్దె ఇళ్లు కూడా ఇవ్వడం లేదు. ఇచ్చిన వాళ్లు గెంటేశారు. కేవలం ఆడవాళ్లకే కాదు మగాళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఆడవాళ్లకు ఆప్షన్ ఉంది కాని మగాళ్లకు అది కూడా లేదు. ఇండస్ట్రీలో చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి వాళ్లకు పూరీ జగన్నాధ్ చాలా హెల్ప్ చేస్తుంటారని చెప్పుకొచ్చారు హేమ.